ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 న జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఆమ్ ఆద్మీ పార్టీ, తమ మేనిఫెస్టో ను ప్రకటించింది.
ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 న జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఆమ్ ఆద్మీ పార్టీ, తమ మేనిఫెస్టో ను ప్రకటించింది. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఈ మేనిఫెస్టో ను విడుదల చేశారు. మహిళలు, విద్యార్థులే లక్ష్యంగా మోత 15 హామీలతో మేనిఫెస్టో ను విడుదల చేశారు
- 24 గంటలు నిరంతరాయంగా నీటి సరఫరా
- యమునా నదిని శుద్ధి చేయడం
- అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు కల్పించడం మొదటి లక్ష్యం. ఢిల్లీ లో నిరుద్జ్యోగం అనేది లేకుండా చేయడమే ఆప్ ప్రధాన అజెండా
- విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం అంతే కాకుండా ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50% రాయితీ
- అర్హులైన వారందరికీ రేషన్ కార్డు లు అంద చేయడం
- మహిళా సమ్మాన్ యోజన కింద అర్హులైన మహిళలందరికీ నెలకు 2100 రూపాయలు
- సీనియర్ సిటిజన్స్, అంటే 60 ఏళ్ళు దాటిన వారందరికీ, సంజీవని పధకం కింద, ఉచిత వైద్యం. ఈ ఉచిత వైద్యం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా. అంతే కాకుండా నీటి బిల్లుల మాఫీ
- యూరప్ తరహాలో రోడ్లను నిర్మించడం
- టాక్సీ, ఈ రిక్షా, ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహానికి లక్ష రూపాయల చేయూత. అంతే కాకుండా, వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత భీమా సదుపాయం
- పూజారులకు ఒక్కొక్కరికి 18 వేల చేయూత
- కౌలు దారులకు ఉచిత కరెంటు, ఉచిత నీటి సరఫరా
- డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం, సమస్యను పరిష్కరించడం

