పూమా (PVMA) బ్రాండ్ అంబాసిడర్ గా పి వి సింధు

by | Jan 24, 2025 | వార్తలు

ప్రముఖ ఫుట్ వేర్ బ్రాండ్ పూమా, బాడ్మింటర్ ప్లేయర్ పి వి సింధుని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.

పి వి సింధు రాకను స్వాగతిస్తూ బ్రాండ్ పేరును  పూమా  రీబ్రాండ్ చేసింది.  పి వి సింధు  పేరులో మొదటి రెండు అక్షరాలైన పి, వి లను చేర్చి ‘PUMA’ ను ‘PVMA’  గా మార్చింది.  ఇది వినూత్నమైన ఆలోచన

పూమా లో భాగమైనందుకు  తన ఆనందాన్ని వ్యక్తం చేశారు పీవీ సింధు.  మహిళలందరూ తమను, తాము నమ్ముతూ  ఉన్నత లక్ష్యాలను సాధించాలి. మహిళలు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడకూడదు, అని పీవీ సింధు అన్నారు.

ఏమైనా, ఒక తెలుగమ్మాయి, అది మన హైదరాబాద్ అమ్మాయి పేరు ని, ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ( పుమా) తన పేరులో చేర్చుకుందంటే, అది మనందరికీ గర్వ  కారణం

పీవీ సింధు ఒలింపిక్స్ లో రెండు పతకాలను గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే