బాహుబలి-2 ని, పుష్ప-2 బీట్ చేసింది, కానీ….?!

by | Jan 23, 2025 | ప్రగడ టీవీ

బాహుబలి-2 ని, పుష్ప-2 బీట్ చేసింది, కానీ, ఇప్పటికి బాహుబలి-2 నెంబర్ వన్ అంటున్న ప్రభాస్ ఫాన్స్.   అదెలాగో చూద్దాం

పుష్ప 2, భారత దేశంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా 8 ఏళ్ళ బాహుబలి రికార్డు ను బ్రేక్ చేసింది.    31 రోజుల్లో, 1831 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ క్రియేటివ్ విడుదల చేశారు.

అయితే ఒక రకంగా ఇప్పటికి బాహుబలి నెంబర్ వన్ అని ప్రభాస్ ఫాన్స్ అంటున్నారు.  అయితే ఈ వాదన కూడా బలంగానే ఉంది.  ఈ అంశాన్ని విశ్లేషిద్దాం.

2017 లో బాహుబలి 2 విడుదలైనప్పుడు టికెట్ రేట్లు సుమారుగా 100-150 రూపాయల వరకు ఉండేవి.  ఎనిమిదేళ్ల తరవాత పుష్ప 2 విడుదలైనప్పు టికెట్ రేట్లు సుమారు 200-530 రూపాయల వరకు ఉన్నాయి.  అంతే కాకుండా బెనిఫిట్ షో టికెట్ రేట్లు 800-1000 రూపాయల వరకు ఉన్నాయి.   ఇవే కాకుండా, పుష్ప 2 విడుదల అయిన నాలుగు, ఐదు రోజులు టికెట్ రేట్లు 300-530 రూపాయలు.

అయితే బాలీవుడ్ లో పుష్ప 2 కి సూపర్ క్రేజ్ అని చెప్పవచ్చు.  ‘స్త్రీ-2’ నెలకొల్పిన 623 కోట్ల రూపాయల రికార్డు ను పుష్ప 2 ఏకం గా 820 తో బీట్ చేసింది. ఈ సినిమా, ఒక్క హిందీలో 201 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది.  ఒక్కొక్క సారి, కొన్ని,కొన్ని ఆలా జరిగిపోతాయి, అంతే

 Bahubali-2Pushpa-2
Release Year20172024
Ticket Rates100-150200-530
Benefit Shows 800-1000
పెంచిన టికెట్ రేట్స్ First 4-5 days
AppealUniversal AppealSuper Craze in Hindi Market (సగటు అల్లు అర్జున్ అభిమాని కూడా ఒకసారి చూడచ్చు అనే సినిమా
No of Screen (Released)900012000
Competition No competition
Contentఅసలైన రాజు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, మునుపెన్నడూ చూడని భారీతనం.  అప్పటి వరకు థియేటర్ లో సినిమాలు చూడని వారు కూడా థియేటర్ కు వచ్చి సినిమా చూడడంSmuggler Hero – Villains is a New Hero
Conclusionఇప్పటికి బాహుబలి, రాజ మౌళి – ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా ; ప్రభాస్ అప్పటికి, ఇప్పటికి, అందరికి డార్లింగ్2024 లో, ఎనిమిదేళ్ల క్రితం సాధించిన కలెక్షన్స్ సాధించడం. కాంట్రవర్సీ, నెగటివిటీ ల మధ్య  

ఇండియాలో బాహుబలి-2 నెట్ కలెక్షన్స్ 1030 కోట్లు. పుష్ప-2 నెట్ కలెక్షన్స్ 1229 కోట్లు (సుమారుగా స్కాన్ లింక్ ప్రకారం).  ఎనిమిదేళ్ల క్రితం బాహుబలి నార్మల్ టికెట్ రేట్స్ తో సాధించిన కలెక్షన్స్ ని, పుష్ప-2, టికెట్ రేట్లు భారీగా పెంచి, ఎక్కువ స్క్రీన్ లలో (సుమారు 3000 ల స్క్రీన్ లు ఎక్కువ, బాహుబలి-2 తో పోలిస్తే) విడుదల చేసిన సాధించిన వసూళ్లు ఇవి.   ఇంకొక విషయం ఏంటంటే, బాహుబలి-2 సినిమా గర్వంగా ఈ రోజు కి మాట్లాడుకుంటుంది యావత్ దేశం.  అయితే పుష్ప-2 సక్సెస్ ని, చిత్ర బృందం కూడా గొప్ప చెప్పుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితికి అనేక కారణాలు, ఈ సినిమా కంటెంట్ తో సహా.

ముంబై లో స్మగ్లర్స్, గ్యాంగ్ స్టర్స్  సినిమాలు బాగానే ఆడతాయి. అలాగే క్రైమ్ సినిమాలు కూడా.  రామ్ గోపాల్ వర్మ సత్య నుండి, నేటి కెజిఫ్ వరకు.  కన్నడ సినిమాని, ఏ బ్యాక్ గ్రౌండ్ లేని యాష్ ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లాడంటే ఈ కంటెంట్, యాష్ స్టైలిష్ యాక్షన్ కారణం

పుష్ప-2 రికార్డు ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూద్దాం.  క్రైమ్, స్మగ్లర్స్ , గ్యాంగ్ స్టర్స్ లాంటి సినిమాలు పుష్ప-2 రికార్డు ని బ్రేక్ చేస్తాయో,  లేదా బాహుబలి లాంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు చేస్తాయో చూద్దాం