రామ్ గోపాల్ వర్మ కు జైలు శిక్ష

by | Jan 23, 2025 | వార్తలు

అవును, మీరు చదివింది నిజమే.  ఇప్పుడే నేను మారిపోయాను అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ కు షాక్. చెక్ బౌన్స్ కేసులో గతం లో ఒక వ్యక్తి వేసిన కేసులో అంధేరి కోర్ట్ రామ్ గోపాల్ వర్మ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.  కేసుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగున్నాడు రామ్ గోపాల్ వర్మ అనే అభియోగం కూడా ఉంది

అంతే కాకుండా, ఫిర్యాదు చేసిన వ్యక్తికీ పరిహారం కింద అక్షరాలా మూడు లక్షల డెబ్భై వేల రూపాయలను చెల్లించామని కోర్ట్ ఆదేశించింది. పరిహారం చెల్లించని యెడల, మరో మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని కోర్ట్ చెప్పింది