తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యం గా బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ తో సమావేశమవుతున్నారు.
తెలంగాణ లో పెట్టుబడి పెట్టడానికి 10 కి పైగా కంపెనీలు తమ ఆసక్తిని చూపించాయి అంతే కాకుండా ప్రభుత్వం తో ఎంఓయూ లు కూడా చేసుకున్నాయి. ఇప్పటిదాకా చేసుకున్న ఎంఓయూల విలువ సుమారు 1. 32 లక్షల కోట్లు అని తెలుస్తోంది. దీనివలన వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెపుతోంది.
అమెజాన్ తో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అమెజాన్ తో ఒప్పందం విలువ సుమారు 60 వేల కోట్లు. ఇంతే కాకుండా మేఘా ఇంజనీరింగ్ సంస్థతో 15 వేల కోట్లు, హెచ్ సి ఎల్ తో 10 వేల కోట్లు, జె ఎస్ డబ్ల్యూ తో 800 కోట్లు, విప్రో తో 750 కోట్లు మరియు స్కై రూట్ తో 500 కోట్ల ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం విలువలో సింహ భాగం అమెజాన్ తో చేసుకున్న ఒప్పందమే
తెలంగాణ వచ్చిన తరవాత ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సారి పెట్టుబడులు సుమారు మూడింతలు పెరిగాయి
కంగ్రాట్యులేషన్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ పెట్టుబడులను చూస్తే తెలంగాణ రైజ్ సాకారమయ్యేలా కనిపిస్తోంది

