గత రెండురోజుల నుండి దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులు, ఇళ్లలో ఐటి దాడులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే
ఈ దాడులను ఇండస్ట్రీ మీద జరుగుతున్న ఐటి దాడులుగా దిల్ రాజు అభివర్ణించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడులు కేవలం మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద దాడులుగా చూడాలి
ఎందుకంటె, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప-2 సుమారు 1850 కోట్ల కు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఇన్ని కోట్లు సాధించిన సినిమాల లెక్కలు ఎలా ఉన్నాయి. ఈ సినిమాకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, వాటి లెక్కలు ఏంటి, ఇన్ని కోట్లు వసూళ్లు సాధిస్తే టాక్స్ ఎంత కడుతున్నారు అనే విషయాలపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి పని చేసిన దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే
ఇక దిల్ రాజు ఇళ్లపై దాడులు ఎందుకు చేస్తున్నారంటే, ఒకేసారి రెండు పెద్ద సినిమాలు నిర్మించడం అంతే కాకుండా మరో పెద్ద సినిమా ను నైజాం ఏరియా లో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకోవడం, గేమ్ చేంజర్ తప్పుడు కలెక్షన్స్ వివరాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం వంటి వంశాలు ఐటి దాడుల జరిగేలా చేసి ఉండవచ్చు. దిల్ రాజు గత సినిమాలలో అంత భారీగా లాభాలు వచ్చిన సినిమాలు లేవు. అయినా గేమ్ చేంజర్ కు భారీగా ఖర్చు పెట్టడం (పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు) వంటి అంశాలు ఐటి దాడులను ప్రేరేపించవచ్చు. అంతే కాకుండా, దిల్ రాజు కు ఫైనాన్స్ చేస్తున్న కారణంగా మాంగో మీడియా మీద కూడా దాడులు చేస్తున్నారు. లెక్కలు సరిగ్గా ఉంటె, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.
కాబట్టి, ఈ దాడులను ఇండస్ట్రీ మీద దాడులుగా చూడకూడదు

