భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టి 20 మ్యాచ్ లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది .
కోల్ కతాలోని, ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది భారత జట్టు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ,సరిగా 20 ఓవర్ లలో, 132 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
ఇంగ్లాండ్ జట్టును ఆదిలోనే ఆర్ష దీప్ సింగ్ రెండు వికెట్లు తీసి చావు దెబ్బ తీశాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి గుగ్లీ లతో వెంట వెంటనే రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను మరిన్ని కష్టాల్లోకి నెట్టాడు. కెప్టెన్ జొస్ బట్లర్ 44 బంతుల్లో 68 పరుగులు చేసినా, అతనికి సహకారం అందించేవారు కరువయ్యారు
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, ఆర్ష దీప్ సింగ్ లు తలా రెండు వికెట్లు తీశారు
అనంతరం 133 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మూడు వికెట్లు నష్టపోయి, కేవలం 12.5 ఓవర్లలో లక్షాన్ని చేధించింది
ఓపెనర్ అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతూ కేవలం 34 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డక్ అవుట్ అవగా, మరో ఓపెనర్ సంజు శాంసన్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
తిలక్ వర్మ 19 పరుగులతో, హార్దిక్ పాండ్య 3 పరుగులతో అజేయం గా లాంఛనాన్ని ముగించారు
5 మ్యాచ్ ల సిరీస్ లో, భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండవ టీ 20 మ్యాచ్ ఈ నెల 25 న జరుగనుంది

