కన్నడ నటుడు కిచ్చ సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన నటుడు. రాజమౌళి ఈగ సినిమాలో ప్రతినాయకుడిగా, ఆ తరవాత చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి స్నేహితుడిగా నటించి మెప్పించారు.
అయితే సుదీప్, కలర్స్ కన్నడ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో వ్యాఖ్యాత గా గత 11 సీజన్లనుండి అలరిస్తూ వచ్చాడు. 11 వ సీజన్ గ్రాండ్ ఫినాలే ఈ నెల 26 న ప్రసారమవబోతోంది. కిచ్చ సుదీప్, బిగ్ బాస్ వ్యాఖ్యాత గా ఇదే నా ఆఖరి సీజన్ అని ఎక్స్ వేదిక గా పోస్ట్ చేశారు
ప్రస్తుతం జరుగుతోన్న 11 వ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. కలర్స్ కన్నడ ఛానల్ ని ప్రైమ్ టైం నెంబర్ వన్ అయ్యే స్థాయికి తీసుకు వెళ్ళింది. బిగ్ బాస్ లేకపోతే, కలర్స్ కన్నడ రెండవ స్థానంలో ఉండేది. జీ కన్నడ గత ఏడేళ్లుగా నెంబర్ వన్ పోసిషన్ లో అప్రతిహతంగా దూసుకు పోతోంది.
బిగ్ బాస్ కి వెచ్చించే సమయానికి, వచ్చే పేరు కి సంబంధం లేకుండా ఉందని, మిగతా బాషలలో ఈ షో కి ఉన్న ఆదరణ కన్నడలో రావట్లేదని, అందుకే ఈ నిర్ణయం అని అన్నట్లుగా సమాచారం
ఏమైనా కిచ్చ సుదీప్ అంటే, బిగ్ బాస్ అనే ముద్ర పడిపోయింది. ఇప్పుడు కలర్స్ కన్నడ వాళ్ళు, ఎవరితో రీప్లేస్ చేస్తారో చూడాలి. ఎవరు వచ్చిన, వాళ్లకు, తమ మొదటి సీజన్ ఛాలెంజింగ్ గానే ఉంటుంది

