కోల్ కతా లోని అర్జికర్ ఆస్పత్రిలో, గత ఏడాది ఆగష్టు లో, జూనియర్ డాక్టర్ అభయ మీద జరిగిన హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ కి, సీల్ధా సిబిఐ స్పెషల్ కోర్ట్, యావజ్జీవ శిక్ష ను విధించింది.
సీల్ధాలోని సిబిఐ స్పెషల్ కోర్ట్ ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు తో పాటు, 50000 రూపాయల జరిమానాను విధించింది. అంటే చనిపోయే వరకు, జైలు లోనే ఉంచాలని తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా, బాధితురాలి కుటుంబానికి 17 లక్షల రూపాయలు చెల్లించాలని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది
అంతకు ముందు, సిబిఐ ఇచ్చిన ఆధారాలతో సెక్షన్ 64, 66, 103 (1), బి ఎన్ ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 120 మంది సాక్షులను విచారించిన కోర్ట్ సంజయ్ రాయి ని దోషి గా తేల్చింది. 20 మంది సాక్షులను విచారించిన తర్వాత సీల్ధా కోర్ట్ సంజయ్ రాయి ని దోషి గా తేల్చింది. సంజయ్ రాయ్ తల్లి కూడా తన కొడుకుకు ఉరి శిక్ష వేయాలని అన్నారు
అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన పై, దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమా లు చేశారు. అనేక మంది డాక్టర్లు, నర్సులు, లాయర్ లు పాల్గొన్నారు. సంజయ్ రాయ్ ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
అయితే సంజయ్ రాయ్, ఇప్పటికి తాను నిర్దోషినని అంటున్నాడు. అయితే కోర్ట్ తీర్పు తరవాత సంజయ్ రాయ్ కోల్ కతా హై కోర్ట్ కి వెళ్ళవచ్చు, ఆ పైన సుప్రీమ్ కోర్ట్ కి కూడా వెళ్ళవచ్చు. ఆఖరుగా, రాష్ట్రపతి క్షమాబిక్ష కూడా కోరవచ్చు

