సమంత నెంబర్ వన్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిలిం స్టార్

by | Jan 20, 2025 | వార్తలు

ఆర్మాక్స్ సంస్థ, దేశం లోనే, మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిలిం స్టార్స్, డిసెంబర్ 2024 లిస్ట్ విడుదల చేసింది.

ఈ లిస్ట్ లో సమంత అగ్రస్థానం లో ఉంది.  పెద్దగా సినిమాలు లేక పోయిన, వెబ్ సిరీస్ ల తో నెంబర్ వన్ స్థానంలో ఉండడం ఆషామాషీ కాదు .

రెండవ స్థానంలో అలియా భట్, మూడవ స్థానం లో దీపికా పదుకొనె ఉన్నారు.  అయితే పుష్ప, అనిమల్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన మాత్రం నాలుగవ స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భారీ చిత్రాలు ఏమి లేకపోయినా, తన సహజమైన అందం తో, నటనతో పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం రణభీర్ కపూర్ తో రామాయణం చేస్తోంది.  సాయి పల్లవి, రష్మిక మందాన తర్వాతి స్థానం లో, అంటే ఐదవ స్థానంలో  ఉండడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు

తరవాతి స్థానాలలో త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, శ్రీ లీల, శ్రద్ధ కపూర్ లు ఉన్నారు.

అయితే ‘ స్త్రీ 2’ తో ఇటీవలే భారీ విజయం అందుకున్న శ్రద్ధ కపూర్ మాత్రం 10 వ స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది

అంతే కాకుండా పెద్దగా పాన్ ఇండియా చిత్రాలు ఏమి చేయక పోయినా, తానూ నటించిన చిత్రాలు పెద్దగా విజయవంతం కాకపోయినా, పుష్ప-2 స్పెషల్ సాంగ్ లో, తన అంద, చందాలతో, జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకుని టాప్ 10 లో చోటు సంపాదించింది