తెలంగాణ ప్రభుత్వ ‘మీ టికెట్’ యాప్ గురించి తెలుసా

by | Jan 18, 2025 | వార్తలు

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే ‘మీ టికెట్’ అనే యాప్ ను లాంచ్ చేసింది.  ఈ యాప్ ను డిపార్ట్మెంట్ అఫ్ ఎలక్ట్రానిక్స్  సర్వీసెస్ – డెలివరీ విభాగం మన ముందుకు తీసుకు వచ్చింది. .  ఈ యాప్ ను, ప్లే స్టోర్ నుండి ‘మీ టికెట్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  మొదటగా మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకుని, తరవాత మీ వివరాలతో లాగ్ ఇన్ అవ్వండి.

ఈ యాప్ ద్వారా మెట్రో టికెట్స్ ను, దేవాలయాలలో టిక్కెట్లను, పార్క్స్ లో టిక్కెట్లను, కాకతీయ జూ పార్క్, నెహ్రు జూ పార్క్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు

అంతే కాకుండా బోటింగ్ ఫెసిలిటీ ఉన్న అనేక పార్క్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. జి హెచ్ ఏం సి కమ్యూనిటీ హాల్స్ ను అద్దెకు బుక్ చేసుకోవచ్చు. ముందు, ముందు  జి హెచ్ ఏం సి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, బస్సు టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఈ మీ టికెట్ యాప్ అందిస్తుంది

యూపీఐ పేమెంట్ లు చేయవచ్చు.  ఒక హెల్ప్ సెంటర్ మెయిల్ ఇది, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు.  హెల్ప్ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ – 1100.  హెల్ప్ సెంటర్ మెయిల్ ఇడి – meeticket-support@telangana.gov.in