కోల్ కతా హత్యాచార ఘటన లో తీర్పు వెలువరించిన కోర్ట్

by | Jan 18, 2025 | వార్తలు

కోల్ కతా లోని అర్జికర్ ఆస్పత్రిలో, గత ఏడాది ఆగష్టు లో, జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్యాచార ఘటనలో సంజయ్ రాయి ని దోషి గా కోర్ట్ తీర్పు వెలువరించింది.

సిబిఐ ఇచ్చిన ఆధారాలతో సెక్షన్ 64, 66, 103 (1), బి ఎన్ ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 120 మంది సాక్షులను విచారించిన కోర్ట్ సంజయ్ రాయి ని దోషి గా తేల్చింది  కోర్ట్ 

అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన పై, దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాల లో అనేక మంది డాక్టర్లు, నర్సులు, లాయర్ లు పాల్గొన్నారు.  సంజయ్ రాయ్ ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. 

సుమారు 18 నెలల తర్వాత 120 మంది సాక్షులను విచారించిన తర్వాత కోర్ట్ సంజయ్ రాయి ని దోషి గా తేల్చింది. 

అయితే తీర్పును మాత్రం సోమవారం ఉదయం చెప్పనున్నారు. సాధారణంగా ఇలాంటి కేసులలో జీవిత కాల శిక్ష లేదా ఉరి శిక్ష వేస్తారు.  అయితే  కోర్ట్ ఎలాంటి శిక్షను ఇస్తుందో సోమవారం ఉదయం వరకు వేచి చూడాలి

అయితే సంజయ్ రాయ్, ఇప్పటికి తాను నిర్దోషినని అంటున్నాడు.  అయితే కోర్ట్ తీర్పు తరవాత సంజయ్ పై కోర్ట్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి