థమన్ ఆవేదనకు బాసటగా మెగాస్టార్

by | Jan 18, 2025 | వార్తలు

అభిమానులందు తెలుగు సినీ అభిమానులు వేరయా

ఒక హీరో గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇంకో హీరో ని నెగటివ్ చేయాల్సిన అవసరం లేదు.  ప్రతి సినీ అభిమాని ఈ విషయం అర్ధం చేసుకోలేరు.

తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్ళింది.  అయితే తెలుగు సినిమా తెలుగు అభిమానులు మాత్రమే తీస్తున్నారు.  ముఖ్యంగా అభిమానం వెర్రి తలలు వేస్తోంది.  ఒక హీరో ని అమితంగా అభిమానించేవారు మరో హీరో సినిమా ని ప్లాప్ చేయాలనీ కోరుకుంటున్నారు.  హీరోలందరూ బాగానే సఖ్యతగా ఉన్నారు.  అభిమానుల వేషాలు వెర్రి తలలు వేస్తున్నాయి.  ఇటీవల వచ్చిన గేమ్ చేంజర్ సినిమాకు నెగటివ్ ప్రచారం జరిగింది.  సినిమాను లోకల్ ఛానల్ లో ప్రసారం చేయడం, సినిమా సన్నివేశాలను సోషల్ మీడియా లో  లీక్ చేయడం వంటి తెలుగు సినిమా దురాభిమానులు చేశారు.  ఈ విషయంపై తమన్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.  దీనికి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

Dear @MusicThaman

నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా  అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.  విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు  నడిపిస్తుంది.