బీటెక్ పట్టభద్రులకు, ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగాలు

by | Jan 14, 2025 | ఉద్యోగాలు

రక్షణ రంగంలో ఉద్యోగాలపై ఆసక్తి ఉందా..? అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లకు ఇదొక సువర్ణావకాశం. సీటీసీ ఎంతో తెలుసా సంవత్సరానికి 18 లక్షలు.

ఎంపిక : బీ టెక్ గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మార్కుల ద్వారా వడపోత ప్రారంభిస్తారు.  దీనిలో సెలెక్ట్ అయినా అభ్యర్థులను ఇంటర్వ్యూ కు పిలుస్తారు.  సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు.  మొదటి రోజు స్టేజి-1 లో ఉత్తీర్ణులు అయిన వారు మాత్రమే తరవాతి నాలుగు రోజులు నిర్వహించే స్టేజి-2 ఇంటర్వ్యూ లో కొనసాగుతారు.  స్టేజి 2 లో సెలెక్ట్ అయిన వారికి  వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు

శిక్షణ మరియు దశలవారీ వేతనాలు : ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ లో అక్టోబర్ 2025 నుంచి శిక్షణ మొదలు అవుతుంది.  శిక్షణ వ్యవధి 49 వారాలు. ఈ శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయలు స్టైఫెండ్ గా చెల్లిస్తారు.  ఈ శిక్షణ ని విజయవంతం గా పూర్తి చేసుకున్నవారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్ మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీ ని,  మద్రాస్ యూనివర్సిటీ  అందిస్తుంది.   ఆ తర్వాత వీరిని లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు.  అనంతరం, సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పెర్మనెంట్ కమిషన్ లోకి తీసుకుంటారు.  మరి కొందరికి సర్వీస్ నాలుగేళ్లపాటు పొడిగిస్తారు

లెఫ్టినెంట్ హోదాలో విధుల్లో చేరిన వారు, రెండేళ్లలో కెప్టెన్, ఆరేళ్లలో మేజర్, 13 ఏళ్లలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు చేరుకోవచ్చు.   మొదటి నెల నుంచే, అన్ని అలవెన్సులు కలిపి సుమారు Rs.1,50,000/- ల వేతనం వస్తుంది

ఖాళీలు : 379 (పురుషులకు 350 | మహిళలకు 29 ), ఆర్మీ విడో లకు 2

విద్యార్హత : సంబంధించిన బ్రాంచిల్లో ఎగినీరింగ్ ఉత్తీర్ణులు.   ప్రస్తుతం కోర్స్ చివరి ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

గమనిక : కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు, బీటెక్ (ఐ టి), ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులవారు అర్హులే. 

వయసు : అక్టోబర్ 1, 2025 నాటికి, 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. 

దరఖాస్తుల గడువు తేదీ : ఫిబ్రవరి 5

వెబ్ సైట్ : www.joinindianarmy.nic.in/