వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా లక్కీ భాస్కర్

by | Jan 12, 2025 | టీవీ & ఓటిటి

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా లక్కీ భాస్కర్.  వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వవహించారు. సూర్య దేవర నాగ వంశి ఈ సినిమాని నిర్మించారు

జి వి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యం గా  ‘కోపాలు చాలండి శ్రీమతి గారు’ పాట సూపర్ హిట్ అయ్యింది

బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇప్పుడు ఈ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా వారు వచ్చే ఆదివారం అనగా, జనవరి 19 న సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయబోతున్నారు