ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సినిమా టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ పై విచారం జరిపిన ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ , గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల టికెట్ రేట్ల పెంపును 14 రోజుల నుండి 10 రోజులకు కుదించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు చేశారు. అంటే మొదటి సంవత్సరం పరీక్షలను కాలేజీ యాజమాన్యం నిర్వహిస్తుంది. ఇంటర్ బోర్డు మాత్రం రెండవ సంవత్సరం పరీక్షలను మాత్రం నిర్వహిస్తుంది. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది

