గేమ్ చేంజర్ నుండి కాసర్ల శ్యామ్ రాసిన కొండ దేవర పాట విడుదలయ్యింది. తమన్, శ్రావణ భార్గవి ఈ పాటను పాడారు.
జనవరి 10 న గేమ్ చేంజర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాలలో తప్ప, మిగతా అన్ని రాష్ట్రాలలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
టికెట్ రేట్స్ పెంపు మీద ఆంధ్ర ప్రదేశ్ లో పిల్ వేశారు. అంతే కాకుండా, తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంపు మీద ఎలాంటి ప్రకటన రాలేదు. దిల్ రాజు టికెట్ రేట్స్ పెంపు మీద క్లారిటీ కోసం వేచి చూస్తున్నారేమో.
మరో రెండు రోజులలో సినిమా విడుదలవుతోంది. కానీ తెలుగు రాష్ట్రాలలో బుక్ మై షో లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అభిమానులు ఆతృతను అర్ధం చేసుకుని దిల్ రాజు ఈ విషయం లో తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటారని వసిస్తున్నాము
ఒక రోజు ముందే ‘అరుగు మీద’ పాటను విడుదల చేశారు

