జనవరి 10 న, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని, తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల ను ఇవ్వడానికి గేట్ లు ఓపెన్ చేశారు.
ఈ టోకెన్లను జారీ చేసే సమయంలో, తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద, ఒక్కసారిగా భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఆరుగురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని రుయా ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు

