టాప్ టెన్ లో విజయ సేతుపతి ‘మహారాజ’

by | Jan 8, 2025 | సినిమా

విజయ సేతుపతి హీరో గా నటించిన సూపర్ హిట్ సినిమా మహారాజ.  ఈ సినిమా తమిళనాడు లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో కూడా మంచి విజయం సాధించింది.  అంతేకాదు, ఓ టి టి లో కూడా సత్తా చాటింది.  విజయసేతుపతి మహారాజ చైనా లో కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

టాప్ టెన్ లో అమిర్ ఖాన్ నటించిన మూడు సినిమాలు ఉన్నాయి. అందులో దంగల్ ఎవరికి అందనంత ఎత్తులో ఉంది

విజయ సేతుపతి 50 వ చిత్రం. అంతే కాకుండా, విజయ్ సేతుపతి సోలో హీరో గా మొదటి 100 కోట్ల చిత్రం.  చైనా లో, అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 చిత్రాలలో దక్షిణాది నుండి విజయసేతుపతి నటించిన మహారాజ మాత్రమే ఉంది. టాప్ టెన్ చిత్రాలను పరిశీలించండి.

దంగల్                                    : 1521 Crores

సీక్రెట్ సూపర్ స్టార్                  : 874 Crores

అంధ ధూన్                             : 380 Crores

భజరంగి భాయిజాన్                 : 334 Crores

హిందీ మీడియం                     : 242 Crores

హిచ్కి                                      : 175 Crores

పీకె                                           : 138 Crores

మామ్                                       : 132 Crores

టాయిలెట్ ఏ ప్రేమ్ కథ          : 110 Crores

మహారాజ                                 : 91 Crores      

ఈ సంక్రాంతికి జెమినీ టీవీ లో మహారాజ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమవబోతోంది