రాజముండ్రి లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటివెళ్లే క్రమంలో ఇద్దరు యువకులు శ్రీ చరణ్, శ్రీ మణికంఠ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాకినాడకు చెందిన చరణ్, మణికంఠ లు ఏడీబీ రోడ్డుపై బైక్ మీద ఇంటికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన వాహనం ధీ కొట్టడంతో ఈ యువకులు మృతి చెందారు.
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మృతుల టుంబాలకు జనసేన తరపున, 5 లక్షల చొప్పున, అలాగే, గేమ్ చెంజర్ నిర్మాత దిల్ రాజు కూడా మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరపున కూడా ఆర్ధిక సాయం చేయమని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఏడీబీ రోడ్డు ను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కనీసం రోడ్డు మీద లైట్ లు కూడా లేవని అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ లో పేర్కొన్నారు
ఈ సమయంలో ఇకనుండి పిఠాపురం వెళ్ళడానికి ఈ రోడ్డు ద్వారానే వెళతానని పవన్ కళ్యాణ్ చెప్పారు

