పుష్ప 2 – ఇండియన్ ఇండస్ట్రీ హిట్

by | Jan 6, 2025 | సినిమా

పుష్ప 2 రికార్డు లను బ్రేక్ చేస్తూ ఇండియన్ సినిమాలలో, అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ 1831 కోట్లు సాధించిన సినిమా గా చరిత్ర సృష్టించింది.  అంతే కాకుండా ఒక్క హిందీ లోనే 806 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి అక్కడ కూడా బాలీవుడ్ హీరోలకు కొత్త టార్గెట్ సెట్ చేసాడు.

అయితే, పుష్ప 2 కలెక్షన్స్ తో బాలీవుడ్ ని కుదిపేస్తున్న పుష్ప కి పుష్ప 1 క్రేజ్ ప్రధాన బలం, ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల కావడం, టికెట్ల ధరలు భారీగా పెంచడం, వేరే సినిమాల రిలీజ్ లు ఏమి లేక పోవడం, క్రిస్మస్ హాలిడేస్, అల్లు అర్జున్ అరెస్ట్ వంటి విషయాలు కూడా సినిమా హైప్ ని భారీగా పెంచేసాయి. అయితే ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ సగటు అభిమాని కూడా ఒకసారి చూడచ్చు అంటున్నాడు.  చెప్పుకోవడానికి కధ అంటూ ఏమి లేదు.  కేవలం హీరో కారెక్టరైజేషన్ మీద, ఎలేవేషన్స్ మీద, డైలాగ్స్ మీద నడిచిన సినిమా…మరి ముఖ్యం గా పుష్ప 1 హైప్ మీద నడిచిన సినిమా.

అయితే కొసమెరుపేంటంటే, గట్టిగా ఈ సినిమా సక్సెస్ ని అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ గాని, ఎవరు, ఎంజాయ్ చేయలేని పరిస్థితి.  దానికి కారణం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ వ్యవహార శైలి, సమాజాన్ని చెడువైపు ప్రభావితం చేసే ఈ సినిమా కంటెంట్.