సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి, కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రేవతి కొడుకు శ్రీ తేజ్ ను పరామర్శించాలనుకుంటున్న అల్లు అర్జున్ కు, రామ్ గోపాల్ పేట పోలీసులు, షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.
అయితే, కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్న ముందుగా సమాచారం ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. సమాచారం ఇస్తే, తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతే కాకుండా అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా వస్తే దానికి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ దే అని పోలీసులు నోటీసు లో పరేకొన్నారు
అల్లు అర్జున్ వస్తున్న విషయాన్ని గోప్యం గా ఉంచాలని, మొత్తం కార్యక్రమం ఒక గంటలోపు అయిపోవాలని పోలీసులు నోటీసు లో పేర్కొన్నారు

