అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ హైదరాబాద్ లో నిర్వహించిన క్యాటలిస్ట్స్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు.
యువ వ్యాపారవేత్తలతో తన వ్యక్తిగత, వృత్తి పరమైన అనుభవాలను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసుకున్నారు. ఏదైనా రంగంలో విజయం సాధించాలంటే నైపుణ్యం తో పాటు, రైట్ అట్టిట్యూడ్ కూడా ఉండాలి అని చిరంజీవి అన్నారు. నెగటివిటీ ని పట్టించుకోకూడదు, వ్యసనాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు
చిరంజీవి యువ వ్యాపారవేత్తలకు, ఈగల్ ఫిలాసఫీ చెప్పారు. అందరు ఒక ఈగల్ లా ఉండాలి అని, లక్ష్యం చేరేవరకు విశ్రమించకూడదు, పోరాడుతూనే ఉండాలి అని చెప్పారు
మీ జీవితంలో జరిగే అవమానాలను ఆయుధాలుగా మలచుకుంటే విజయం తధ్యమని చిరంజీవి చెప్పారు
అంతే కాకుండా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నా అచీవ్ మెంట్స్ అని చెప్పారు. అంతే కాకుండా మెగా ఫామిలీ లో ఉన్న నటులందరూ నా అచీవ్ మెంట్స్ అని అన్నారు

