పుష్ప కు ఊరట ; రెగ్యులర్ బెయిల్ మంజూరు

by | Jan 3, 2025 | వార్తలు

సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, మధ్యంతర బెయిల్ పై విడుదల అవడం జరిగింది.  హై కోర్ట్ ఆదేశాలతో, అల్లు అర్జున్ కు 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ అప్పీల్ చేశారు.

అల్లు అర్జున్ బెయిల్ అప్పీల్ పై ఈ రోజు నాంపల్లి కోర్ట్ తీర్పును ఇచ్చింది.  అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్ట్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.  50 వేళా రూపాయలు, రెండు పూచీకత్తుల మీద ఈ మెయిల్ మంజూరు చేశారు.

అయితే విచారణ కొనసాగుతుంది. అల్లు అర్జున్ తరపు లాయర్స్ తర్వాత ప్రాసెస్ ను నడిపిస్తారు.  అయితే కేసు పెట్టిన రేవతి భర్త భాస్కర్, ఇప్పుడు కేసును విత్ డ్రా చేసుకుంటున్నాడు కాబట్టి, ఇక ఈ కేసు ముగిసినట్లే.