గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాని దిల్ రాజు తన 50 వ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మావెరిక్ డైరెక్టర్ శంకర్ దర్సత్త్వం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
గేమ్ చేంజర్ ట్రైలర్ ని మొదట గా జనవరి 1 న విడుదల చేస్తున్నామని దిల్ రాజు విజయవాడ లో రామ్ చరణ్ కట్ అవుట్ ఆవిష్కరణకు వచ్చిన సందర్భం గా చెప్పారు. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ ట్రైలర్ ఈ రోజు విడుదల చేయడం లేదని తెలుస్తోంది. గేమ్ చేంజర్ ట్రైలర్ ను రేపు అనగా జనవరి 2 న, సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం అభిమానులు ఇంకో 36 గంటలు వేచి చూడక తప్పదు

