టాప్ స్టార్స్ సినిమాలకు కధ అవసరం లేదా. కలెక్షన్స్ చూస్తుంటే అవసరం లేదనే చెప్పాలి. 2024 లో వచ్చిన పెద్ద హీరోల సినిమాలలో ముఖ్యం గా చెప్పుకోవలసిన చిత్రాలు గుంటూరు కారం, కల్కి, దేవర, పుష్ప-2. 2024 లో వచ్చిన చిత్రాలలో కలెక్షన్స్ పరంగా టాప్ 5 చిత్రాలు ఏంటంటే పెద్ద హీరోల చిత్ర నాలుగు తో పాటు, తేజ నటించిన హనుమాన్.
అయితే ముందుగా 2024 సంక్రాంతి కి వచ్చిన గుంటూరు కారం సినిమా. ఈ సినిమాలో కధ, కధనాలు చాలా నాసిరకం గా ఉంటాయి. త్రివిక్రమ్ కధలు చాలామటుకు పాత సినిమాలనుంచి ఎత్తుకొచ్చినట్లు ఉంటాయి. ఈ సినిమా కలెక్షన్స్ కి ప్రధాన కారణం మహేష్ బాబు, సంక్రాంతి కి సినిమా రావడం, కుర్చీ మడత పెట్టి సాంగ్, చాల రోజుల తర్వాత మహేష్ బాబు ఒక మాస్ క్యారెక్టర్ చేయడం
ఆ తర్వాత కల్కి. ఈ సినిమాలో కధ ఎలా ఉన్న, కధనం చాల వీక్. అయితే కల్కి కథను పురాణాలకు ముడి ట్టడం ఒక నావెల్టీ పాయింట్. అంతే కాకుండా హీరో క్యారెక్టర్ ను స్టార్ వార్స్ తరహాలో తీర్చిదిద్దడం, సాంకేతికతను ఉపయోగించి సరికొత్త వాహనాలను తయారు చేయడం వంటివి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచానికి తీసుకు వెళతాయి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని శక్తివంతం గా తీర్చి దిద్ధడం, పార్ట్ 2 ఉందన్న లీడ్ ఇవ్వడం, మరి ముఖ్యం గా ప్రభాస్ ఈ సినిమాలో హీరో కావడం ఈ చిత్రం బలాలు.
ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకునె, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం, మేకింగ్ పరం గా భారీతనం, మహానటి లాంటి అద్భుత చిత్రాన్ని తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకుడు కావడం ఈ చిత్రానికి ప్రధాన బలాలు.
అయితే కధ, కథనాల పరంగా కల్కి సినిమా వీక్ . ఓ టి టి ప్రేక్షకులను కల్కి అంతగా ఆకట్టుకోలేదు
ఇక దేవర. తారక్ లాంటి నటుడిని చేతిలో పెట్టుకుని నాసిరకమైన కధ తో వచ్చిన కొరటాల శివ ఈ సినిమాతో మరో సారి తన కధ గాడి తప్పినట్లు నిరూపించుకున్నాడు. చాలా వరకు రిపీట్ షాట్లు, పాత చింతకాయలాంటి కధ, కథనాలతో విసుగు తెప్పించాడు. జాహ్నవి కపూర్ లాంటి బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుని ఆ క్యారెక్టర్ ని తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వీక్ హీరోయిన్ క్యారెక్టర్ బూతద్దంలో వెదికినా మనకు కనపడదు. ఈ సినిమా లో ఏమైనా బలం ఉందా అంటే కేవలం సముద్రం బ్యాక్ డ్రాప్, తారక్ నటన. దర్శకుడు కొరటాల శివ దేవర పార్ట్ 2 కి మంచి లీడ్ ఇవ్వాలన్న తపనతో పార్ట్ 1 ని పూర్తి గాలికొదిలేశాడు. కట్టప్ప బాహుబలినిఎందుకు చంపాడు అనే పాయింట్ నుండి స్ఫూర్తి పొందిన కొరటాల శివ అలాంటి తరహా లీడ్ ఒకటి దేవర పార్ట్ 1 క్లైమాక్స్ లో వదిలాడు.
ఇక పుష్ప 2 కలెక్షన్స్ తో బాలీవుడ్ ని కుదిపేస్తున్న పుష్ప కి పుష్ప 1 క్రేజ్ ప్రధాన బలం, ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల కావడం, టికెట్ల ధరలు భారీగా పెంచడం, వేరే సినిమాల రిలీజ్ లు ఏమి లేక పోవడం, క్రిస్మస్ హాలిడేస్, అల్లు అర్జున్ అరెస్ట్ వంటి విషయాలు కూడా సినిమా హైప్ ని భారీగా పెంచేసాయి. అయితే ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ సగటు అభిమాని కూడా ఒకసారి చూడచ్చు అంటున్నాడు. చెప్పుకోవడానికి కధ అంటూ ఏమి లేదు. కేవలం హీరో కారెక్టరైజేషన్ మీద, ఎలేవేషన్స్ మీద, డైలాగ్స్ మీద నడిచిన సినిమా…మరి ముఖ్యం గా పుష్ప 1 హైప్ మీద నడిచిన సినిమా
ఇక చిన్న సినిమా లా విడుదలై ప్రపంచ స్థాయిలో బిగ్ హిట్ అయ్యిన హనుమాన్ సినిమాకి కూడా కధ, కధనాలు చాలా వీక్. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తే మెగాస్టార్ చిరంజీవి 20 ఏళ్ళ క్రితం నటించిన అంజి సినిమా గుర్తుకు వస్తుంది. అంజి కధ కు ఆంజనేయస్వామి ఎలిమెంట్ జోడించడం, చివరలో హనుమాన్ చాలీసా పెట్టడం తో థియేటర్ నుండి బయటకు వచ్చే సగటు ప్రేక్షకుడు భక్తి భావనతో బయటకు వచ్చాడు. అదే సమయం అయోధ్యలో రామ మందిరం ప్రస్తావనకూడా ఉంది, ఇది కూడా హనుమాన్ విజయానికి దోహదం చేసింది. సంక్రాంతికి రావడం, సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు వీక్ గా ఉండడంతో కుటుంబ ప్రేక్షకులకు మొదటి ఛాయిస్ హనుమాన్ అయ్యింది.
అయితే ఇవన్నీ చూసిన తర్వాత తెలుగు సినిమాకి కావలసిన ఇంగ్రేడియంట్స్ ఏమిటో మనకు తెలుస్తుంది. ఇలాంటి సినిమాలకు ఓ టి టి లో, టెలివిజన్ రిపీట్ వేల్యూ ఉండదు
ఎలేవేషన్స్, బ్యాక్ డ్రాప్, స్టార్ హీరోస్, టికెట్ల రేట్లు పెంచడం, ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం వంటి వాటి మీద ఆధారపడకుండా కధ, కథనాల మీద కూడా తెలుగు సినిమాల ఫోకస్ ఉండాలి

