ఎం పి డి ఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్

by | Dec 28, 2024 | వార్తలు

కడప రిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న గాలివీడు ఎం పి డి ఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించిన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్.  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్నీ తీవ్రం గా ఖండించారు. దీనికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

పూర్తి గా విచారణ జరిపించి, నిజా నిజాలు తెలుసుకుని, తగిన యాక్షన్ తీసుకుంటామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు

మీడియాతో మాట్లాడుతుండగా, అభిమానులు ఓ జి అని అరుస్తుండాగా మాట్లాడితే relevance ఉండాలి అన్నారు. సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడగగా కొంత అసహనానికి గురయ్యారు.  మనుషులు చనిపోతుంటే, సినిమాలు ఎలా మాట్లాడతాం అని అన్నారు

పవన్ కళ్యాణ్ గారు  ప్రస్తుతం ఓ జి, హరి హర వీర మల్లు, ఉస్తాద్ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు,  పూర్తి స్థాయిలో ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు.