కేటిర్ ను అరెస్ట్ చేయవద్దు : హై కోర్ట్

by | Dec 20, 2024 | రాజకీయాలు

మాజీ మంత్రి కేటిర్ కు హై కోర్ట్ లో స్వల్ప ఊరట లభించింది.  ఫార్ములా ఈ కార్ రేసు కు సంబంధించి తెలంగాణ ఏసీబీ కేటిర్ పై FIR నమోదు చేసిన విషయం తెలిసిందే.  అయితే ఈ FIR ను క్వాష్ చేయాలనీ హై కోర్టులో కేటిర్ తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున సుదర్శన రెడ్డి వాదనలు వినిపించగా, తరపున సుప్రీమ్ కోర్ట్ సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు

వీరి వాదనలు విన్న ధర్మాసనం, ఈ నెల 30 వరకు కేటిర్ ను అరెస్ట్ చేయవద్దని,  అయితే విచారణ కొనసాగించవచ్చని, విచారణకు కేటిర్ సహకరించాలని ఆదేశించారు.

ఇప్పటికే ప్రాధమిక దర్యాప్తు జరిగిన కారణంగా మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు

నిన్న తెలంగాణ భావంలో ప్రెస్ మీట్ పెట్టి తన వాదాన్ని వినిపించారు.  ఈ రోజు అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి గారు తన వాణి వినిపించారు.

ప్రభుత్వ తరపు న్యాయవాది ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 56 కోట్లకు పైగా నిబంధనలను ఉల్లంఘించి బిల్లులు చెల్లించారని చెపుతున్నారు.

కేటిర్ చెపుతున్న దాని ప్రకారం ఫార్ములా ఈ కార్ వలన కోట్లు లాభం వచ్చిందని చెపుతున్నారు. అయితే ప్రస్తుతం హై కోర్ట్ 10 రోజులు గడువు ఇచ్చింది.  ఈ పది రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి

ఎవరు నిజం, ఎవరు అబద్దం అనేది తేలాల్సివుంది