మెగాస్టార్ చిరంజీవి తరవాత ప్రభాస్ నెంబర్ వన్ హీరోనా!!!

by | Dec 12, 2024 | సినిమా

నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వీరందరూ ఆయా కాలాలలో దశాబ్దాలపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోలుగా వెలుగొందారు. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ లో, గణాంకాల ప్రకారం చూస్తే ప్రభాస్ నెంబర్ వన్ అని అనక తప్పదు.

ప్రభాస్ 2002 లో ఈశ్వర్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట్లో లవ్ స్టోరీస్, కుటుంబ కధా చిత్రాలు చేసినా, ప్రభాస్ కి స్టార్ డమ్ తీసుకువచ్చింది మాత్రం యాక్షన్ సినిమాలు మాత్రమే. రాజమౌళి తో చేసిన ఛత్రపతి, కొరటాల శివ తో చేసిన మిర్చి సినిమాలు ప్రభాస్ ను మంచి యాక్షన్ సినిమా హీరోగా నిలబెట్టాయి. అంతే కాదు మిర్చి సినిమాతో, యంగ్ గర్ల్స్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్నాడు.

2015 మరియు 2017 లో రాజమౌళి తో చేసిన బాహుబలి ఫ్రాంచైజ్ తో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత వచ్చిన సలార్, కల్కి సినిమాలతో ప్రపంచ స్థాయిలో మరోసారి తన సత్తా చాటాడు.

ప్రపంచ వ్యాప్తం గా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మొదటి పది సినిమాల జాబితాలో ప్రభాస్ నటించిన సినిమాలు రెండు ఉన్నాయి. అవి బాహుబలి 2 మరియు కల్కి.

ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో బాహుబలి-2 మొదటి స్థానంలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మొదటి 10 తెలుగు సినిమాలలో 6 సినిమాలు ప్రభాస్ నటించినవే. అవేంటంటే బాహుబలి 1 & 2, కల్కి, సలార్, సాహో , ఆదిపురుష్. మొదటి 5 సినిమాలల్లో నాలుగు సినిమాలు ప్రభాస్ నటించినవి అయితే మరొకటి రామ్ చరణ్, తారక్ నటించిన ఆర్, ఆర్, ఆర్ (RRR).

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మొదటి 10 సినిమాలు. ఇందులో ప్రభాస్ నటించిన సింఎంలు నాలుగు ఉన్నాయ్. మిగతా ఆరింటిలో రామ్ చరణ్ సినిమాలు రెండు, చిరంజీవి, తారక్,యష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ నటించిన సినిమాలు తలా ఒకటి ఉన్నాయి

Rank Movie Gross (Cr)
1 RRR 396 Cr
2 Bahubali-2 307 Cr
3 Kalki 2898 AD 231 Cr
4 Salaar 218 Cr
5 Ala Vaikuntapuramlo 196 Cr
6 Bahubali-The Beginning 172 Cr
7 Waltair Veerayya 171 Cr
8 Sarileru Neekevvaru 161 Cr
9 Rangasthalam 158 Cr
10 KGF-Chapter 2 156 Cr

సినిమా కలెక్షన్స్ లో మాత్రమే కాదండోయ్ వ్యక్తిత్వంలో కూడా మన డార్లింగ్ ప్రభాస్ నెంబర్ వన్. ఎందుకంటె వివాదాల్లోకి రాడు, సినిమా హిట్ ప్లాపుల గురించి గాని, కలెక్షన్స్ గురించి గాని పెద్దగా పట్టించుకోడు, అందరికి కడుపునిండా ఇంటిభోజనం పెడతాడు, అన్ని రికార్డు లు ఉన్నా ఆటిట్యూడ్ చూపించడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటాడు

గణాంకాలతో పాటు వ్యక్తిత్వంలో ను ఈ తరం లో ప్రభాస్ నెంబర్ వన్ హీరో అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఒక ఈవెంట్లో సుమ సరదాగా రానా ని ఏ హీరో, ఏ సబ్జెక్టు లు టీచ్ చేస్తే బావుంటుంది అని అడిగింది. అందులో భాగంగా ప్రభాస్ ఫోటో ని చూపించి ఏ సబ్జెక్టు టీచ్ చేస్తే బావుంటుంది అని అడగగా రానా బిహేవియర్ అండ్ కల్చరల్ క్లాసెస్ చెప్తే బావుంటుంది అన్నాడు. ఇది చాలదా ప్రభాస్ వ్యక్తిత్వం గురించి చెప్పడానికి

రాబోయే సినిమాల లిస్ట్ కూడా భారీ గా ఉంది. మారుతీ తో రాజా సాబ్, ప్రశాంత్ నీల్ తో సలార్ -2, సందీప్ వంగతో స్పిరిట్ తో పాటు కన్నప్ప, హను రాఘవపూడి సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ కట్ అవుట్ కనిపిస్తే చాలు కంటెంట్ ఎలా ఉన్నా టాప్ 10 గ్రాస్ కలెక్షన్స్ మూవీస్ లిస్ట్ లో పడాల్సిందే