పెళ్లికి ఏయే దేవతలు వస్తారో తెలుసా

by | Dec 12, 2024 | ప్రగడ టీవీ

పెళ్లికి ఏయే దేవతలు వస్తారో తెలుసా

కళ్యాణం ఈ పదం లో ఎంత కమ్మదనం ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడుక జీవితానికంతటికి మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలి పోతుంది. ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కల్యాణ ఘడియ తరవాతే మనిషి జీవితానికి ఒకే పరిపూర్ణత లభిస్తుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబంలోనూ, అటు సంఘంలోనూ కూడా ఒక గుర్తింపును కలుగచేసేది కళ్యాణమే. ఎన్నెన్నో సుఖాలు, కష్టాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నింటిని ఒకరికొకరు సమానంగా పంచుకుని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుక ఉన్న పరమార్ధం. ఇందులో చదివే ప్రతి వేదం మంత్రాక్షరం వెనుక ఉన్న అర్ధమూ ఇదే. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్లి పందిరిలోకి ఏయే దేవతాలొస్తారో, వారి వారి వెంట ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం

పెళ్ళిలో ప్రధమం గా గణపతి పూజ ప్రారంభమవుతుంది. కాబట్టి వినాయకుడు ఆ పెళ్లి మంటపానికి మొదటగా వస్తాడు. ఆయన తన పూజనందుకుని నిత్యవరుడై నిత్యకల్యాణాన్ని పచ్చతోరణంతో జరుపుకునే ఆ శ్రీ మహావిష్ణువుని అయన భార్య శ్రీమహాలక్ష్మీదేవి తో సహా వేదికవద్దకి పంపించి మరీ వెళ్తాడు గణపతి

ఆ మహావిష్ణువే సతిసమేతం గా మన పెళ్లి వేదిక మీద కలశంలో సర్వ వివాహ ధర్మాన్ని గమనిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు సతీసమేతంగా వస్తున్నాడనే సమాచారాన్నిముందుగా గరుడుడు దేవతలందరికీ తెలియచేస్తాడు. దాంతో శ్రీ మహావిష్ణువుకు స్వాగతం పలికేందుకు విష్ణువు రాకకై ముందే పెళ్లివేదిక వద్దకు అష్టదిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కుల్ని పరిపాలించే ఇంద్రుడు (తూర్పు), అగ్ని (ఆగ్నేయం), యముడు (దక్షిణం), నైరుతి (నైరుతి), వరుణుడు (పశ్చిమం ), వాయువు ( వాయువ్యం), కుబేరుడు (ఉత్తరం),ఈశానుడు (ఈశాన్యం) వీరందరూ వివాహ వేదిక వద్దకు చేరుకుంటారు. వీరితోపాటు వీరి దాసులు, దాసానుదాసులు, భక్తులు, వైకుంఠ కైలాస నివాసులు అంతా అక్కడికి రానేవస్తారు

వారు వారి ధర్మపత్ని సమేతంగా అనగా వశిష్ట, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప,జమదగ్ని మొదలగు సప్తమహర్షులూ వచ్చి ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. శాస్త్రోక్తంగా మంత్రం పూరక వివాహానికి నిస్వార్ధంగా ఇందరు దేవతలు, ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహాన్ని మంత్రం పూర్వకంగా వద్దంటే మనము ఏంటో కోల్పోయినట్లే కదా.

అందుకే సీతారాముల కళ్యాణం చూతము రారండి అన్నారు