ట్రంప్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ కంపెనీ లో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఒక నీలి చిత్ర నటి, నోరు తెరవకుండా ఉండడానికి ట్రంప్ డబ్బులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు ఆ ఆరోపణలన్నీ నిజమేనని తేలింది. అంతే కాదు క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న తొలి మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి కారణాలను విశ్లేషిద్దాం.
సామజిక మాధ్యమాలు
ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా, తన అభిప్రాయాలను త్వరితగతిన ప్రజలకు చేరువ చేసే విషయంలో విజయం సాధించారు. అక్రమ వలసదారులను అడ్డుకుంటానని, నేరాలను, అవినీతి అంతమొందిస్తానని, అక్రమ వలసలకు కారణమవుతున్న మెక్సికో సరిహద్దును మూసేస్తానని ట్రంప్ చెప్పడం అమెరికన్లను ఆకట్టుకుంది. సామజిక మాధ్యమాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విషయంలో స్ అధినేత ఎలాన్ మాస్క్ ఈ విషయంలో ట్రంప్ కు సాయపడ్డారుఆర్థిక స్థితిగతుల ప్రభావం
2024లో అమెరికాలో ఆర్థిక పరిస్థితులు కీలకంగా మారాయి. పన్నుల భారాలు పెరగడం, గ్యాస్ ధరల పెరుగుదల, టెక్ కంపెనీలలో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం, ఇతర దేశాలనుంచి వచ్చిన వాళ్ళు తమ ఉగ్యోగ అవకాశాలను దెబ్బ తీయడం వంటి ప్రతికూల పరిస్థితులలో ట్రంప్ “అమెరికా ఫస్ట్” నినాదంతో తిరిగి ఆర్థిక వృద్ధిని సాధిస్తానని వాగ్దానం ఇచ్చారు. బలమైన ఆర్థిక విధానాల కోసం తన సత్తాను చూపడంలో ఇది సహాయపడింది. ట్రంప్ ఉన్నప్పుడే జీవన ఆర్ధిక స్థితిగతులు బావుండేవని భావించారు. కోవిడ్ మహమ్మారి వల్ల పరిస్థితులు దిగజారాయన్న విషయం అమెరికన్ల మదిలో లేదు. ఆ విషయం గురించి పట్టించుకోలేదు.గ్రామీణ, వృద్ధ, పురుష ఓటర్ల మద్దతు
పితృస్వామ్య భావాలు కలిగిన వారు, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చే గ్రామీణ, వృద్ధ, పురుష ఓటర్లు ట్రంప్ కు ఓటు వేశారు. 54% మహిళలు మాత్రం కమలా హారిస్ కు ఓటు వేశారు. పితృ స్వామ్య భావజాలానికి మహిళా ఓటర్లు వ్యతిరేకం గా ఉన్నారని తెలుస్తోంది. ట్రంప్ కు ఓటు వేసిన వారిలో అత్యధికులు పితృస్వామ్య భావజాలం కలిగిన సాంప్రదాయ అమెరికన్లు. సాంప్రదాయ అమెరికన్లు గర్భస్రావ హక్కును వ్యతిరేకిస్తారు. కుటుంబవ్యవస్థకు సంబంధించిన ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తారుఇమిగ్రేషన్ వ్యతిరేకత
2024లో, అమెరికాలో శరణార్థుల ప్రవాహం పెరిగింది, ఇది అనేక వర్గాల నెగిటివ్ స్పందనను తెచ్చింది. ట్రంప్ ఇమిగ్రేషన్ నియంత్రణ పై తన కఠిన విధానాన్ని కొనసాగించాడు, అది ప్రత్యేకంగా “అమెరికా మొదట” అనే భావనను సమర్థించే ఓటర్లను ఆకర్షించింది.
మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ నినాదాలు
తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ యుద్దాన్ని ఒకరోజు లో ముగిస్తానని ట్రంప్ ప్రకటించడం, పన్ను కోతలతో పెట్టుబడులను తీసుకువస్తానని, ఉపాధి అవకాశాలను పెంచుతానని, నిత్యావసరాలు, చమురు ధరలను అదుపులో ఉంచుతానని, తద్వారా, అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇవన్నీ అమెరికన్లలో బలమైన ముద్ర వేశాయి ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, బైడెన్ ప్రభుత్వంలో చర్యల వాళ్ళ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం దిగి వస్తున్నాయి. స్టాక్ మార్కెట్ కూడా పరుగులు పెడుతోంది. అయితే ఇవ్వన్నీ ఓటర్ల దృష్టిని ఆకర్షించేలోగా ఎన్నికలు వచ్చేశాయికమలా హారిస్ పరాజయానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం
అవగాహన లేమి : ట్రంప్ ధీటైన ప్రసంగాలతో అదరగొడుతూ ఉంటె, కమలా హారిస్ ప్రసంగాలు అంతగా అమెరికా ఓటర్లను అంతగా ఆకట్టుకోలేదు. ప్రచారంలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక దాటవేత ధోరణి అవలంభించిది. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో, మీకు అధ్యక్షురాలిగా అవకాశం వచ్చి ఉంటె, బైడెన్ కు భిన్నంగా ఏమి చేసేవారు అని అడిగిన ప్రశ్నకు కమలా హారిస్ ఏమో నాకేమి తట్టడంలేదు అని సమాధానం ఇచ్చింది. ఈ విషయం తన సొంత పార్టీ అభ్యర్థులనే విస్మయానికి గురి చేసింది. తన సొంత డెమోక్రాటిక్ పార్టీ లో సమన్వయ లోపం కూడా కమలా హారిస్ ఓటమికి కారణం బైడెన్ నిర్ణయాలు, వైఫల్యాల ప్రభావం : వయసు పైబడుతున్న అధ్యక్ష పదవి కి పోటీ చేయాలన్న బైడెన్ నిర్ణయంపై డెమోక్రాటిక్ పార్టీ పై ప్రజలకు విసుగు వచ్చింది. ఆఖరి నిమిషంలో కమలా హారిస్ ను అధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించినా, బైడెన్ ప్రభావం కమలా హారిస్ పై పడింది. బైడెన్ నిర్ణయాల ప్రభావం, ముఖ్యం గా ధరల పెరుగుదల, యుక్రెయిన్ యుధం మీద కోట్ల డాలర్లు వెచ్చించడం వంటి అంశాలు ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ మెడ కు చుట్టుకుంది. మరోవైపు పితృస్వామ్య భావజాలం తో గెలిచిన ట్రంప్ మీద ఆధునిక అమెరికన్ వనితలు కోపం గా ఉన్నారు. ఇది పురుషాధిక్య పితృస్వామ్య భావజాలమని నిరసిస్తున్నారు.ట్రంప్ గెలుపు నుండి నేర్చుకోదగిన పాఠాలు
- సబ్జెక్టు పై పట్టు సాధించడం
- కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ప్రత్యర్థుల బలహీనతలను, తప్పులను సమర్ధవంతం లెక్కలతో సహా ప్రజల్లోకి తీసుకువెళ్లడంకు
- టుంబ వ్యవస్థకు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం
- టార్గెట్ ఆడియన్స్ పై దృష్టి పెట్టడం (ముఖ్యం గా మిడిల్ క్లాస్ గ్రామీణ అభ్యర్థులను లక్ష్యం చేసుకుని ట్రంప్ తన ప్రసంగాలను తయారుచేసుకోవడం)
కమలా హారిస్ ఓటమి నుండి నేర్చుకోదగిన పాఠాలు
- సబ్జెక్టు పై అవగాహన లేమి ఎంత ప్రభావం చూపిస్తుంది అనే దానికి కమల హారిస్ చక్కని ఉదాహరణ.
- నాయకుల తప్పుడు నిర్ణయాల ప్రభావం టీం మెంబెర్స్ మీద ఎంతటి ప్రతికూల ప్రభావం చూపుతుంది అనే దానికి బైడెన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల ప్రభావం కమలా హారిస్ మీద పడడం. ఆలా అని ఇక్కడ స్వపక్షంలో విపక్షం లా ఉండలేరు కూడా

