వైభవ్ సూర్యవంశీ  మ్యాచ్ కు రెండు సిక్స్ లు మాత్రమే కొడతాడా

by | Jul 8, 2026 | క్రీడలు | 0 comments

ఐర్లాండ్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన తరవాత  వైభవ్ సూర్యవంశీ ని తీసుకోకపోవడం పై కోచ్ గంభీర్ పై సోషల్ మీడియా లో తీవ్ర విమర్శలు వచ్చాయి.  ఐర్లాండ్ తో జరిగిన రెండవ టి 20 లో కూడా ఓడిపోయిన తరవాత విమర్శలు తారాస్థాయి కి చేరాయి

ఆ దెబ్బకు ఇంగ్లాండ్ తో టి 20 సిరీస్ కు వైభవ్ సూర్య వంశి ని అరంగేట్రం చేయించారు .  ఇంగ్లాండ్ తో టి 20 సిరీస్ లో కూడా భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది.  మొదటి మ్యాచ్ లో కెప్టెన్ శ్రేయాస్ రాణించినా వర్షం కారణం గా ఆ మ్యాచ్ రద్దు అయ్యింది.

ఇంగ్లాండ్ తో మొదటి టి 20 లో ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు సంజు శాంసన్. వరుస మ్యాచ్ ల్లో ఘోరంగా విఫలమవుతూ వస్తోన్న సంజు శాంసన్ స్థానంలో వైభవ్ కు రెండవ టి 20 మ్యాచ్ లో స్థానం కల్పించారు .

క్రికెట్ ఫాన్స్ కోరుకున్న వైవ్ సూర్యవంశీ జట్టులోకి వచ్చినా  భారత టి 20 జట్టు తల రాత మారలేదు.  రెండవ మరియు మూడవ టి 20 మ్యాచ్ లలో కూడా  ఓడిపోయింది

భారత జట్టు కెప్టెన్ మూడవ టి 20 లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.  మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. బట్లర్ 21 బంతుల్లో 36 పరుగులు చేయగా, మరో ఓపెనర్ సాల్ట్ 44 బంతుల్లో 77 పరుగులు చేశాడు. నాలుగవ స్థానంలో వచ్చిన అల్ రౌండర్ సామ్ కరణ్ 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు.

ఆకట్టుకున్న ప్రిన్స్ యాదవ్, నిరాశ పరచిన వైభవ్ సూర్య వంశి

మొదటి మ్యాచ్ ఆడిన ప్రిన్స్ యాదవ్ మెరుగైన ఎకానమీ తో బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు. 201 పరుగుల ఛేదించే క్రమంలో భారత జట్టు 11.4 ఓవర్లలో 76 పరుగులకు అల్ అవుట్ అయింది

ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్య వంశి రెండవ టి 20 లో 10 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  అయితే రెండు సిక్స్ లు కొట్టాడు.  మూడవ టి 20 లో 5 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ఈ మ్యాచ్ లో కూడా రెండు సిక్స్ లు కొట్టాడు. 

అంది వచ్చిన అవకాశాన్ని వైభవ్ దూకుడైన ఆటతో దూరం చేసుకుంటున్నాడా, చిన్న వయసులో నే అంచనాలు అమాంతంగా పెరిగి పోవడంతో బాదుడే లక్ష్యం గా  బరిలో దిగుతున్నాడా.  స్ట్రైక్ రొటేట్  చేయడానికి, క్రీజ్ లో నిలబడడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదా అంటే అవుననే చెప్పాలి.   ఇండియన్ పిచ్ ల మీద జరిగే  ఐపీల్ మ్యాచ్ ల కు ఇంగ్లాండ్ పిచ్ ల మీద ఆటకు తేడా ఉంటుంది.  మూడవ టి 20 లో అయినా క్రీజ్ లో కుదురుకోవడానికి వైభవ్ ప్రాధాన్యతను ఇస్తే భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది

వరుస ఓటముల కు  కోచ్ గంభీర్ ని, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ని నిందించడం ఏ మాత్రం సబబు కాదు. 11 మండే ఆడే ఆట లో ఏ ఒక్కరినో నిందించడం సరి అయింది కాదు. కోచ్ ఎంత చెప్పినా గ్రౌండ్ లో ఆడేది 11 మంది ఆటగాళ్లే.  జట్టు సమిష్టి వైఫల్యాలే వెంటాడుతున్నాయి. 

ఒక్క  మ్యాచ్ గెలిస్తే భారత జట్టు గాడిన పడుతుంది.  మూడవ టి 20 లో గెలిస్తే సిరీస్ ను సమం చేసే అవకాశం ఉంటుంది.