రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది అతి పెద్ద హిట్. రామ్ చరణ్ నటనను విమర్శకులు కూడా అభినందిస్తున్నారు.
బుచ్చిబాబు రాసుకున్న ఈ కధ లో స్పోర్ట్స్ కు సంబందించిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చు అధికంగానే ఉంటుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలి అన్న ఒకే ఒక్క పాయింట్ తో సినిమా బడ్జెట్ ను ఇంకా భారీగా పెంచేశారు.
ఈ నేపథ్యంలో పెద్ది సినిమా ఇంత పెద్ద హిట్ అయినా కూడా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు కు పెద్ది గాడు కొన్ని పాఠాలు నేర్పించాడు
ఐదు సంవత్సరాలు ఈ సినిమా కధ పై కూర్చున్న బుచ్చిబాబు హీరోయిన్ అచ్చియమ్మ క్యారెక్టర్ ను గొప్పగా మలచడంలో విఫలమయ్యాడు. అంతే కాకుండా ఈ క్యారెక్టర్ ను కధలో అంతర్భాగం చేయడంలో కూడా బుచ్చిబాబు పట్టు తప్పాడు. క్యారెక్టర్ బలంగా రాయలేకపోవడం ఒక తప్పిదం అయితే, జాహ్నవి కపూర్ రాకతో సినిమా బడ్జెట్ పెంచడం మరో తప్పిదం. ఈ సినిమాలో రామ్ చరణ్ ను, జాహ్నవి కపూర్ కు ఒక్క పాట మాత్రమే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల లాగా డ్యూయెట్ లు లేవు
అంతే కాకుండా సుకుమార్ శిష్యుడిగా స్పెషల్ పాట పెట్టాలి అన్న తపనతో పెట్టిన శృతి హాసన్ పాట సినిమాకు పెద్దగా బలం చేకూర్చలేదు. పాట బాగుంది. రామ్ చరణ్ డాన్స్ బాగుంది. అయితే అసందర్భంగా వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఒక్కసారిగా కధ నుండి దారి తప్పేలా చేసింది ఇక్కడ కూడా శృతి హాసన్ పాట ద్వారా సినిమా బడ్జెట్ ను అనవసరంగా పెంచేశారు పెంచేశారు
రావు రమేష్ పాత్ర కూడా కేవలం ఒక్క సన్నివేశంలో చూపించారు. అలాగే కమెడియన్ లు సత్య, చమ్మక్ చంద్ర ల క్యారెక్టర్ లకు కూడా అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. మీర్జాపూర్ సిరీస్ తో పాపులర్ అయిన Divyendu క్యారెక్టర్ కూడా చిత్ర ప్రధమ భాగంలో మాత్రమే ప్రధానంగా కనిపిస్తుంది. పెద్ది జర్నీ లో అప్పడప్పడు కనిపించే బోమన్ ఇరానీ పాత్ర ద్వారా ఖర్చు కూడా బాగా పెరిగింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు ఎవరైనా ఉంటె రామ్ చరణ్ తరవాత జగపతి బాబు, శివ రాజ్ కుమార్ లు మాత్రమే.
పెద్ది సినిమా కధనంలో మరింత వేగం ఉండాలి. ఎంత గొప్ప సందేశం ఇచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కధ చెప్పగలగాలి.
బడ్జెట్ ను అదుపులో పెట్టుకోవడం, క్యారెక్టర్ లను శక్తివంతంగా తయారు రాయడం, సినిమా కధనంలో వేగం ఉండేలా చూసుకోవడం వంటి అంశాలను బుచ్చిబాబు తన తదుపరి సినిమా తీసేటప్పడు దృష్టిలో పెట్టుకోవాలి
.
25 కోట్లతో ఉప్పెన తీసిన వ్యక్తి ఒకేసారి 350 కోట్ల సినిమా తీయడం సాహసం అని చెప్పాలి. అయితే మొదటి సినిమాలో హీరో, హీరోయిన్ లు ఇద్దరు కొత్తవారే. అయినా సరే బ్లాక్ బస్టర్ కొట్టాడు. రెండవ సినిమా రామ్ చరణ్ వంటి స్టార్ హీరో చేత పెద్ది లాంటి పాత్ర చేయించడం మామూలు విషయం కాదు. అయితే రెండు సినిమాల క్లైమాక్స్ లో బుచ్చిబాబు షాక్ లు మాత్రం హైలైట్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో బుచ్చిబాబు కూడా పెద్ది లాగా బ్లాక్ బస్టర్
బుచ్చిబాబు నిజాయితీపరుడు, క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి అని చెప్పవచ్చు. బుచ్చిబాబు అద్భుతమైన కధకుడు ఉన్నాడు. అద్భుతమైన దర్శకుడు ఉన్నాడు. పెద్ది సినిమా లో కొన్ని సన్నివేశాలలో వీళ్లిద్దరు కనిపిస్తారు
బుచ్చిబాబు కు పెద్ది రెండవ సినిమా మాత్రమే. ముందు ముందు బుచ్చిబాబు మరింత రాణిస్తే రామ్ చరణ్ చెప్పినట్లు ఇండియా లో టాప్ 5 దర్శకుల జాబితాలో చేరిపోవడం గ్యారంటీ

