టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీతో సంక్రాంతి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘భోగి’(Bhogi) సీనియర్ డైరెక్టర్ సంపత్‌నంది (Sampath Nandi) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా, తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రత్యేకంగా వేసిన ఓ భారీ సెట్లో శర్వానంద్ మీద స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ సారథ్యంలో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యేవరకు ఈ షూట్లోనే శర్వానంద్ పాల్గొననున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు. తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ ఫస్ట్‌లుక్స్‌ని (First Look) మేకర్స్ విడుదల చేశారు. మ్యాసీ హెయిర్ స్టెల్తో రగ్గ్డ్ గడ్డంతో చేతిలో పదునైన ఆయుధంతో సీరియస్‌గా చూస్తూ శర్వానంద్ (Sharwanand) దర్శనిస్తున్నారు. ఇందులో శర్వానంద్ మాస్ లుక్, పవర్ఫుల్ ప్రెజెన్స్ చూసిన తర్వాత సినిమా మీద హైప్ మరింత పెరిగిపోయింది. ఇందులో గంగ అనే పాత్రలో శర్వానంద్ కనిపించనున్నారు. ఇక ‘భోగి’ (Bhogi) సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. 2026 ఆగస్ట్ 28న సినిమాని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. కాగా, 1960 ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో జరిగే ఈ కథ ఇంటెన్స్ ఎమోషన్స్, హై వోల్టేజ్ డ్రామాతో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. అత్యద్భుతమైన విజువల్స్‌తో, ప్రపంచస్థాయి నిర్మాణ విలువలతో ఓ ఎపిక్‌గా ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. కాగా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

