చిరు రికార్డ్‌ని స‌మం చేసిన బన్నీ..ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ విన్నర్స్‌ వీరే!

by | Feb 22, 2026 | సినిమా

టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ (Film Fare Awards) 2026 పురస్కారాల వేడుక శనివారం రాత్రి కేరళలోని కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక‌లో 2024లో థియేట‌ర్ల‌లో విడుదలైన తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ చిత్రాలలో న్యాయ నిర్ణేత‌లు ఎంపిక చేసిన‌ ఉత్త‌మ చిత్రాల‌కు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అంద‌జేశారు. ఈ వేడుకల్లో 2024 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(పుష్ప-2) అవార్డ్ అందుకోగా.. ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో యువ హీరో తేజ సజ్జా(హనుమాన్) అవార్డ్ దక్కించుకున్నారు. అయితే అల్లు అర్జున్ (Allu Arjun) ఈ అవార్డ్ అందుకోవడం ద్వారా ఆయన కెరీర్‌లో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తయ్యాయి. యువ హీరోల్లో ఇన్ని ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా ఐకాన్ స్టార్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఇక ఈ అవార్డ్ ద్వారా ఫిల్మ్‌ఫేర్ అవార్డులో మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ సమం చేశారు. చిరు తన కెరీర్‌లో 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకోగా, ఇప్పుడు ‘పుష్ప 2’తో వచ్చిన ఈ అవార్డుతో అల్లు అర్జున్ కూడా అదే మార్కుకు చేరుకున్నారు. కాగా, ఈసారి అవార్డుల్లో ఉత్తమనటిగా నివేదా థామస్(35-చిన్న కథ కాదు) అవార్డ్ అందుకోగా.. 2024లో ఉత్తమ సినిమాగా ‘పుష్ప-2’ చిత్రం అవార్డ్ దక్కించుకుంది.
ఇక ఉత్తమ దర్శకుడుగా సుకుమార్‌ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.

ఇక ఫిలింఫేర్ అవార్డులు పొందిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితా పరిశీలిస్తే…

ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్ (Pushpa 2)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ (వెంకీ అట్లూరి)

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్) Sukumar

ఉత్త‌మ‌ డెబ్యూ (ఫిమేల్) – నయన్ సారిక (గం గం గణేశ)

ఉత్త‌మ‌ డెబ్యూ (మేల్) – సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్త‌మ‌ డెబ్యూ (డైరెక్టర్) – యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జ (హను మాన్) Teja Sajja

ఉత్తమ నటి (క్రిటిక్స్) : కాజల్ అగర్వాల్‌ (సత్యభామ) Kajal Agarwal

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్) Allu Arjun

ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) Niveda Thomas

ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)

ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)

ఉత్త‌మ‌ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2)

ఉత్త‌మ‌ లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె – దేవర)

ఉత్త‌మ‌ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): శిల్పా రావు (చుట్టమల్లె – దేవర)

ఉత్త‌మ‌ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి- గుంటూరు కారం)

ఉత్త‌మ‌ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్‌ ( కుర్చీ మడతపెట్టి – గుంటూరు కారం)

ఉత్త‌మ‌ ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనికా (పుష్ప 2), నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 AD)