‘టాక్సిక్‌’ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌ ఇదే.. క్యూరియాసిటీ పెంచేస్తుందిగా!

by | Feb 18, 2026 | సినిమా

‘కేజీఎఫ్‌’ (KGF) ఫ్రాంఛైజీ చిత్రాలతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్‌ (Yash) . ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. (Toxic) ఈ సినిమాలో కియారా అద్వానీ, న‌య‌న‌తార, రుక్మ‌ణీ వ‌సంత్, హుమా ఖురేషి, తార సుతారియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజర్ (Teaser) ద్వారా యష్ డిఫరెంట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. మలయాళ డైరెక్టర్ గీతూ మోహ‌న్ దాస్ (Geethu Mohan Das) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ ‘టాక్సిక్‌’ (Toxic) సినిమా బ్యాక్‌డ్రాప్‌ గురించి ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం ఈ చిత్రం 1940 నుండి 1970 మధ్య కాలంలో గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అప్పట్లో గోవాలో నేర సామ్రాజ్య పరిస్థితులు, వారి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరయోధుడి కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ముఖ్యంగా భయం, హింస, నమ్మక ద్రోహం వంటి అంశాల మీద నిర్మించబడిన ఒక నేర సామ్రాజ్యం ఎలా నిర్మించబడింది, తన ఉనికిని ఎలా చాటుకుంది అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో హీరో పాత్ర కొన్ని మానసిక సంఘర్షణలతో ఉండి రఫ్ అండ్ పవర్‌ఫుల్ గా ఉండనున్నట్లు సమాచారం. మొత్తానికి హీరో యశ్ పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేలా సినిమాను సిద్దం చేస్తు్న్నాడని తాజా అప్‌డేట్ చెప్పకనే చెబుతోంది. ఈ క్రేజీ వార్త అఫీషియల్ కానప్పటికీ మూవీ లవర్స్‌, ఫ్యాన్ మాత్రం ఫుల్‌ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.