‘అల్లు అర్జున్ 42 రూల్స్’.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కావేరీ

by | Feb 17, 2026 | సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) పై ఇటీవల ప్రముఖ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరీ బారువా (Kaveri Barua) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో యాడ్ షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని, ఆయన్ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తాజాగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తాను చేసిన వ్యాఖ్యలపై కావేరీ బారువా తాజాగా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఒక నోట్‌ విడుదల చేశారు. అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమంటూ ఆమె తెలిపారు. 42 రూల్స్ (42 Rules) అనేవి లేవని అసలు దానికి సంబంధించిన లిస్ట్‌ ఎవరు రిలీజ్ చేశారో తనకు తెలియదని ఆమె వెల్లదించారు. అల్లు అర్జున్‌పై అనవసర ఆరోపణలు చేసినందుకు తాను ఎంతగానో బాదపడుతున్నానని పేరొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల అల్లు అర్జున్ (Allu Arjun) ప్రతిష్టకు భంగం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాని కావేరి బారువా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

ఇక మరోవైపు కావేరి బారువాను ఇంటర్వ్యూ చేసిన పాడ్‌కాస్టర్ స్వీకృతి కూడా తన క్షమాపణలు తెలిపారు. అల్లు అర్జున్ గురించి కావేరి బారువా మాట్లాడిన పూర్తి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ను తొలగించినట్లు వెల్లడించారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. బన్నీ కథానాయకుడుగా తమిళ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కేవలం దీపికా పదుకొణె మాత్రమే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) తో పాటుగా జిమ్ సర్భ్, కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత భారీ వ్యయంతో సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ‘AA22 x A6’ (AA22 x A6) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో, గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు