సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) . ఇందులో మహేష్‌ను నెక్ట్స్ లెవెల్‌లో చూపించడానికి రాజమౌళి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇక కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ‘వారణాసి’తో వచ్చే గ్లోబల్ ఇమేజ్‌ను నిలబెట్టుకోవడానికి తన తదుపరి సినిమాను మహేశ్ బాబు అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు అగ్ర దర్శకులు మహేశ్ బాబు కోసం కథలు సిద్ధం చేసినప్పటికీ ప్రస్తుతం ఆయన దేనికీ అంగీకారం తెలుపలేదని తెలుస్తోంది.
అయితే ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) , మహేశ్ బాబు కాంబినేషన్‌లో సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమా అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ కాంబినేషన్ మళ్లీ పునరావృతం అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా గతంలోనే మహేశ్ బాబు కోసం ‘డెవిల్’ (Devil) అనే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని అది ‘వారణాసి’ మూవీ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) తో స్పిరిట్ (Spirit) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, మహేశ్ బాబు కోసం గతంలో చెప్పిన స్క్రిప్ట్ ను మరోసారి చర్చించినట్లు సమాచారం. ఇది తన ఇమేజ్‌కి బాగా సరిపోతుందని భావించిన మహేశ్ వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో జోరుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు (Mahesh Babu) చేస్తున్న ‘వారణాసి’ (Varanasi) ఈ ఏడాది చివర్లో పూర్తి కావచ్చు. ఆలోగా ‘స్పిరిట్’ని కూడా పూర్తిచేసి ఆపై వెంటనే మహేశ్ బాబు సినిమాపై దృష్టిపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట సందీప్ రెడ్డి వంగా. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మహేశ్ బాబు-సందీప్ రెడ్డి వంగా సినిమా ఖాయమని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

