టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) కథానాయకుడిగా రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్'(The Paradise) . టాలెంటెడ్ డైరెక్టర్ ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మోహన్ బాబు, తనికెళ్ల భరణీ, కిల్ ఫేం రాఘవ్ జుయల్ సంపూర్ణేష్ బాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనున్నారు. సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో నాని తల్లి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాని ‘జడల్’ (Jadal) అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే దాదాపు ఏడాదిన్నరకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా వాయిదా పడింది.
ప్రస్తుతం దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అందుకే ఇక ఆలస్యం చేయకుండా ప్రమోషన్లను స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ‘ఆయా షేర్..’ (Aaya Sher) అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ఫిబ్రవరి 24న నాని (Nani) పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతుందని అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు. ఈ సాంగ్ లో నానిని సరికొత్త అవతార్‌లో చూపించనున్నారని, వందలాది డ్యాన్సర్లు పాల్గొన్న ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అదిరిపోయే బీట్‌ను అందించారని అంటున్నారు. ఇక ఈ సాంగ్ తోనే ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం నాని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.


