పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడుగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh). హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) కథానాయికగా నటిస్తుంది. రాశీఖన్నా (Rashi Khanna) కీలక పాత్రలో అలరించనుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. గతంలో పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటున్న ఈ సినిమా ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేసింది. ఇటీవల రిలీజైన ‘దేఖ్ లేంగే సాలా’ లిరికల్ వీడియో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి పాట సూపర్ హిట్ కావడంతో సెకండ్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ (Aura of Ustad) అనే రెండో సాంగ్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో. వైరల్ గా మారింది.

