T20 World Cup : పాక్ ను చిత్తుగా ఓడించిన భారత జట్టు

by | Feb 15, 2026 | క్రీడలు

భారత, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 61 పరుగుల తేడాతో పాక్ పై ఘన విజయం సాధించింది

176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు 18 ఓవర్ల లో 114 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.

ఇండియా తో ప్రపంచ కప్ లో మ్యాచ్ ఆడము అని చెప్పిన పాకిస్థాన్ సుదీర్ఘ చర్చలు తరవాత ఆడడానికి శ్రీలంక వచ్చింది. మ్యాచ్ ఆడడానికి చేసిన హడావిడి, బరిలో దిగినప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లలో కనపడలేదు.

ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుండి క్రమం తప్పకుండా  వికెట్లు కోల్పోతూ వచ్చింది పాకిస్థాన్. పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో 44 పరుగులు చేసిన ఉస్మాన్ ఖాన్ టాప్ స్కోరర్.  షహీన్ షా ఆఫ్రిది 23 పరుగులు, షాదాబ్ ఖాన్ 14 పరుగులు  ఫహీమ్ 10 పరుగులు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో కూడా ముగ్గురు ఆటగాళ్లు డక్ అవుట్ అయ్యారు

భారత బౌలర్లలో బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, పాండ్య లు తలా రెండు వికెట్లు తీసుకోగా, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు.

అంతకు ముందు  టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

భారత జట్టు మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది.  అభిషేక్ శర్మ డక్ అవుట్ అయ్యాడు.  ఈ వరల్డ్ కప్ లో డక్ అవుట్ అవడం ఇది రెండోసారి.  వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ తో జత కలిసిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వీరిద్దరూ కలిసి రెండవ వికెట్ కు 87 పరుగులు జోడించారు.

ధాటిగా ఆడిన ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి సయీమ్ అయూబ్ బౌలింగ్ లో లైన్ మిస్ అయ్యి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ లు  మూడవ వికెట్ కు 38 పరుగులు జోడించారు. 25 పరుగులు చేసిన తిలక్ వర్మ అవుట్ అయిన తరవాత వచ్చిన హార్దిక్ పాండ్య ఆడిన మొదటి బంతికే డక్ అవుట్ అయ్యాడు.

శివమ్ దూబే, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ లు ఐదవ వికెట్ కు 33 పరుగులు జోడించారు. సూర్య కుమార్ యాదవ్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. షహీన్ షా ఆఫ్రిది వేసిన ఇన్నింగ్స్ ఆఖరి (20) ఓవర్ లో శివమ్ దూబే ఒక ఫోర్, రింకు సింగ్ ఒక ఫోర్, ఒక సిక్సర్ బాదారు. అయితే 20 వ ఓవర్ ఐదవ బంతికి దూబే రన్ అవుట్ అవగా, ఆఖరి బంతికి అక్షర్ పటేల్ డక్ అవుట్ అయ్యాడు

భారత జట్టు ఇన్నింగ్స్ లో ముగ్గురు ఆటగాళ్లు డక్ అవుట్ అయ్యారు.

పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ ఆఘ మొదటి ఓవర్ లో అభిషేక్ శర్మ ని డక్ అవుట్ చేసి శుభారంభాన్ని ఇవ్వగా, మిడిల్ ఓవర్ల లో సయీమ్ అయూబ్ మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు.  విచిత్ర బౌలింగ్ యాక్షన్ తో బౌలింగ్ చేసే ఉస్మాన్ తారిఖ్ కు ఒక వికెట్ దక్కింది.  ఆఖరి ఓవర్ లో షహీన్ షా ఆఫ్రిది కి ఒక వికెట్ దక్కింది