టాలీవుడ్ యువ హీరో నిఖిల్ (Nikhil) నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. (Swayambhu) డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి (Bharath Krishnamachari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిఖిల్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీరియాడికల్ సబ్జెక్ట్‌తో వస్తున్న సినిమా కావడంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో మేకర్స్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ టీజర్‌లో చూపించిన విజువల్స్, నిఖిల్ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, వార్ సీక్వెన్స్‌లతో కూడిన ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే టీజర్‌కు (Teaser) వచ్చిన రెస్పాన్స్‌తో పాటు మరో న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా టీజర్‌ను హై క్వాలిటీలో మళ్లీ అప్‌లోడ్ చేసిన సందర్భంగా హీరో నిఖిల్ చేసిన ఒక ట్వీట్ చర్చకు దారితీసింది. ‘కొన్ని సాంకేతిక కారణాల వల్ల ‘స్వయంభు’ సినిమా టీజర్ మీ బెస్ట్ ఎక్స్ పీరియన్స్ కోసం తిరిగి అప్‌లోడ్ చేశాం. ఈ ఎపిక్ టీజర్ ఇప్పుడు హెచ్‌డీఆర్ క్వాలిటీతో మీ ముందుకు రానుంది’ అని పేర్కొన్నారు. ఆ తరువాత మరో ట్వీట్ చేస్తూ ‘ఇటీవల వచ్చిన ఒక సినిమాలా మా చిత్రంలో ఎలాంటి ఏఐ (AI) టెక్నాలజీ వినియోగించలేదు’ అని పేర్కొనడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిఖిల్ ఏ సినిమాను ఉద్దేశించి ఈ కామెంట్ చేశారనే దానిపై ఇండస్ట్రీలో చర్చలు మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ‘ఏఐ’ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తమ సినిమాల్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించలేదని మేకర్స్ చెప్పుకొంటున్నారు. అయితే నిఖిల్ మాత్రం ఏఐ గురించి చెబుతూనే మరో సినిమా గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇదో రకం పబ్లిసిటీ స్టెంట్ అని కొందరు అంటుంటే, కావాలని వేరే సినిమా గురించి కామెంట్ చేశాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


