మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.
మన శంకర వర ప్రసాద్ గారు శాటిలైట్ మరియు ఓ టి టి హక్కులను జీ నెట్వర్క్ (Zee Telugu) వారు దక్కించుకున్న విషయం తెలిసిందే. నిన్నటి నుండి అనగా ఫిబ్రవరి 11 నుండి, మన శంకర వర ప్రసాద్ గారు జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్ అయిన మొదటి 24 గంటల్లో 200 మిలియన్ + స్ట్రీమింగ్ మినిట్స్ తో జీ 5 (ZEE5) తెలుగు చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. థియేటర్లలోనే కాదు మన శంకర వర ప్రసాద్ గారు ఓ టి టి లోను సరికొత్త రికార్డు లు సెట్ చేస్తున్నారు.
,ఇది ఇలా ఉండగా, మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఫిబ్రవరి 22 న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ (World Television Premiere) గా జీ తెలుగు (Zee Telugu) లో ప్రసారమవుతున్నట్లుగా తెలుస్తోంది.

