ఫ్యాన్స్ గెట్ రెడీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూట్‌పై న‌యా అప్‌డేట్ ఇదే!

by | Feb 9, 2026 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ‘సీతా రామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. (Fouji) ఇందులో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సీతారామం’ వంటి క్లాసిక్ హిట్ తరువాత హను రాఘవపూడి ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై (Mythri Movie Makers) నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. విశాల్‌ చంద్ర శేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కాకుండా మరెలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఇప్ప‌టికే కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి తాజా అప్‌డేట్ వ‌చ్చింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. కీలకమైన టాకీ పార్ట్ కూడా పూర్తయ్యిందట. యుద్దానికి సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ తో పాటు సుమారు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్నారని తెలుస్తోంది. వీరంతా ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌ కోసం 100 రోజుల వరకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల సారథ్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా ఈ సినిమా మిగిలిన షూటింగ్​కు సంబంధించిన పనులను కూడా శరవేగంగా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సిఉంది. కాగా, ‘ఫౌజీ’ రెండు భాగాలుగా విడుదలకానున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ నేపథ్యంలో జరిగే హిస్ట్టారికల్‌ రొమాంటిక్‌ డ్రామాగా ‘ఫౌజీ’ తెరెకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్, రాహుల్‌ రవీంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.