హిట్ కోసం స్వయంగా కథ రాయనున్న రామ్!

by | Feb 9, 2026 | సినిమా

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కి సరైన హిట్ దొరకలేదు. కాస్త గ్యాప్ తీసుకొని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా చేసిన రామ్. ఈ సినిమా సక్సెస్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇందులో ‘నువ్వుంటే చాల్లే’ సాంగ్ కు లిరిక్స్ రాసి గేయ రచయితగా మారాడు.. ఇంకో సాంగ్ ను పాడి సింగర్ గానూ ప్రయత్నించాడు. కానీ, సినిమా మాత్రం అభిమానులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో రామ్ (Ram) కొంతకాలం విరామం తీసుకుని కొత్త సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తరువాత రామ్ సరైన హిట్ కోసం ఎవరినీ నమ్ముకోకుండా తానే రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో స్టోరీ బావుంటేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. దీంతో తన సినిమాకు కథ తానే రాసుకోవాలని నిర్ణయించుకున్నాడట రామ్ పోతినేని. ఇందుకోసం రామ్ విదేశాలకు వెకేషన్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. మూడు నెలల పాటుగా అక్కడే ఉండనున్న రామ్ తన సినిమా కథపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయ్యాక జూలైలో తన కొత్త సినిమాను ప్రారంభించాలని రామ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఓ కొత్త డైరెక్టర్ తెరకెక్కించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. సరైన హిట్ కోసం తన చిత్రానికి తానే కథ రాసుకుని రామ్ సరికొత్త ట్రెండ్ కు తెరలేపడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.