కడుపుబ్బా నవ్వించే ‘గాయపడ్డ సింహం’ ట్రైజర్ చూశారా?

by | Feb 9, 2026 | సినిమా

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు, న‌టుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) హీరోగా క‌శ్య‌ప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’ (Gayapadda Simham). ఈ మూవీకి ‘డోన్ట్‌ లాఫ్‌… ఇట్స్‌ ఏ సీరియస్‌ మేటర్‌’ అనేది క్యాప్షన్‌ జోడించారు. ఇందులో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సూర్య ప్రకాశ్‌ జోస్యుల కథను అందించగా, విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీని, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ (Teaser),ట్రైలర్ (Trailer) కలిపిన ‘ట్రైజర్'(Traiser) ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ ట్రైజర్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఈ ట్రైజర్ లో తరుణ్‌ భాస్కర్‌ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘పెళ్లి చూపులు సినిమా యావరేజ్.. కానీ, ఓవర్ హైప్ అయింది అంతే’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ అదిరిపోయింది. ఈ సినిమా కథ విషయానికొస్తే… అమెరికా వెళ్లాలని ఆశపడే యువకుడి వీసా రిజెక్ట్ కావడంతో అతడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేది నేపథ్యంగా ఈ సినిమా సాగనున్నట్లు ట్రైజర్ (Traiser) చూస్తే అర్థమవుతోంది. పొలిటికల్‌ సెటైర్, కామెడీ వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. కాగా, ఈ చిత్రాన్ని స‌ప్త అశ్వ మీడియా వ‌ర్క్‌స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సాదినేని (Pavan Sadhineni) ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.