‘స్పిరిట్’ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్..అసలు కారణం అదేనా?

by | Feb 9, 2026 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ల కాంబోలో ‘స్పిరిట్’ (Spirit) అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas) పవర్ ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ ఫిల్మ్స్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన వాయిస్ గ్లింప్స్, పోస్టర్స్ ఇలా అన్నీ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు మేకర్స్. ‘స్పిరిట్‌’ 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) కీలక పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వాయిస్ టీజర్‌కు కూడా ప్రకాష్ రాజ్ వాయిస్ అందించారు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్‌ తో పాటుగా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రకాష్‌ రాజ్‌ మధ్య విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. ఈ విషయం పై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక అంతకుముందు స్పిరిట్ మూవీ నుంచి హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika) కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా తప్పుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇదిలావుంటే.. స్పిరిట్ మూవీ 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ వంటి తొమ్మిది భాషల్లో ఈ మూవీని రిలీజ్‌ కానుంది.