టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రస్తుతం’ ఫంకీ’ (Funky) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడన్న సంగతి తెలిసిందే. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఫంకీ’ చిత్రానికి ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్ (Anudeep) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం ‘ఫంకీ’ (Funky) సినిమాకు వరల్డ్ వైడ్‌గా మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.15 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సిఉంటుంది. ఇక రిలీజ్‌కు ముందు చిత్రబృందం భారీగా ప్రమోషన్‌లు జరుపడంతో ‘ఫంకీ’ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక మౌత్ టాక్ పాజిటీవ్‌గా వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమి కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 2గంటల 10నిమిషాలు మాత్రమే. ఇంత తక్కువ రన్‌టైమ్‌లో అవసరమైన సీన్లను మాత్రమే కాస్త ఎంగేజింగ్గా చూపిస్తే ‘ఫంకీ’ పాసైనట్టే. అలాగే ప్రస్తుత పరిస్థుతుల్లో థియేటర్లలో పెద్ద సినిమాలు కూడా ఏమి లేవు. కాబట్టి ఇది కూడా ఈ చిత్రానికి కలిసొస్తుందని చెప్పాలి. కాగా, ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ (Naga Vamsi), సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

