‘గాయపడ్డ సింహం’గా తరుణ్ భాస్కర్.. ఈసారి రచ్చ రచ్చే!

by | Feb 7, 2026 | సినిమా

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు, న‌టుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) కథానాయకుడిగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క‌శ్య‌ప్ శ్రీనివాస్ (Kasyap Srinivas) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స‌ప్త అశ్వ మీడియా వ‌ర్క్‌స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ( JD Chakravarthy) కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సూర్య ప్రకాశ్‌ జోస్యుల కథను అందించగా, విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీని, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటుగా ఫ‌స్ట్ లుక్‌ని (Title and Frist Look) చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు ‘గాయపడ్డ సింహం’ (Gayapadda Simham) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ ఫ‌స్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అమెరికాకు వెళ్లాలి అనుకున్న యువ‌కుడికి ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ (Trump) నిర్ణయాల కారణంగా ఎలాంటి ప‌రిస్థితి ఎదురైంది అనేది ఈ సినిమా క‌థగా తెలుస్తోంది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజ‌ర్‌(Teaser) ను ఫిబ్ర‌వ‌రి 09న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.