మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) . ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఇప్పటి వరకూ రూ.375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు సినీ ప్రేమికుల చూపంతా వేసవి సీజన్‌పై పడింది. అయితే ఈ ఏడాది వేసవి సీజన్ పై మెగా ఫ్యామిలీ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ వేసవి సీజన్ లో మెగా ఫ్యామిలీకి చెందిన అయిదు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) సినిమా మార్చి 26న విడుదల కానుంది. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న హార్రర్ ఫాంటసీ మూవీ ‘రాకాస’ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddi) సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఇక చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభరను (Viswambhara) జూలైలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanaka Raju) కూడా వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఈసారి వేసవి సీజన్లో మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా ఐదు సినిమాలు విడుదల కావడం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. మరి వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందో అన్నది చూడాలి.

